‘సీతా పయనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

‘సీతా పయనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Mar 15, 2026 12:05 PM IST

Seetha Payanam Review

యాక్షన్ కింగ్ అర్జు్న్ సర్జా డైరెక్ట్ చేసిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సీతా పయనం’(Seetha Payanam). ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ లాక్ చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు ‘సన్‌ ఎన్‌ఎక్స్‌టీ’ వేదికగా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. మార్చి 20, 2026 నుంచి తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి సదరు స్ట్రీమింగ్ సంస్థ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇక ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో నిరంజన్ హీరోగా నటిస్తుండగా అర్జున్ సర్జా, ప్రకాష్ రాజ్, సత్య రాజ్, బిత్తిరి సత్తి, కోవై సరళ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ఓటీటీలో ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. అన్నట్టు ‘శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు