చిరంజీవి స్ఫూర్తితో సమాజ సేవ చేస్తున్నాను – సూర్య.

చిరంజీవి స్ఫూర్తితో సమాజ సేవ చేస్తున్నాను – సూర్య.

Published on Aug 7, 2014 12:10 PM IST

chiru-surya
తెలుగు, తమిళ భాషలలో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సూర్య. వైవిధ్యమైన పాత్రలతో, విభిన్న కధాంశాలతో సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సమాజ సేవ కూడా చేస్తున్నారు. ‘అగరం’ చిల్ద్రెన్ ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్ధుల చదువుకు కృషి చేస్తున్నారు. పలువురు ప్రముఖులు సూర్యకు తమ మద్దతు తెలుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను ‘అగరం’ చిల్ద్రెన్ ఫౌండేషన్ స్థాపించినట్టు సూర్య తెలిపారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించిన చిరంజీవి ఎందరికో ఈ చూపును ప్రసాదించారు. రక్త దానం చేస్తున్నారు. హీరోగా అగ్ర స్థానంలో ఉన్న చిరంజీవి అభిమానుల కోసం ప్రేక్షకుల కోసం ఏదైనా చేయాలని భావించి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ప్రారంభించారు. ఆయనలో సేవాగుణం నాకు బాగా నచ్చింది. అదే బాటలో నేను నడవాలని నిర్ణయించుకున్నాను. ‘అగరం’ చిల్ద్రెన్ ఫౌండేషన్ స్థాపించాను. అని సూర్య అన్నారు. సూర్య నటించిన తాజా సినిమా ‘సికిందర్’ ఆడియో సక్సెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు