కొరటాల సినిమా డిటైల్స్ రివీల్ చేసిన మెగాస్టార్ !

Published on Aug 19, 2019 12:03 am IST

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా మెగాస్టార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రంలో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నానని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదు’ అని చిరు తెలిపారు. వచ్చే వారంలో ఈ సినిమాలో చిరు లుక్ కి సంబంధించి లుక్ టెస్ట్ జరగనుందట. ఈ లుక్ టెస్ట్ ను బట్టే సినిమాలో మెగాస్టార్ గెటప్ ను డిసైడ్ చెయ్యాలని కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందట. ఇక కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. మెగాస్టార్, ప్రస్తుతం స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X