మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినాను ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరోసారి నిరూపించింది. ‘భోళా శంకర్’ మిగిల్చిన రూ.50 కోట్ల నష్టాన్ని, సరిగ్గా అదే స్థాయిలో లాభాలను అందిస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తోంది. ‘విశ్వంభర’ వాయిదా పడటంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వచ్చిన ఈ ఎంటర్‌టైనర్, కేవలం రెండు వారాల్లోనే రూ.300 కోట్ల మార్కును దాటి రికార్డులు సృష్టిస్తోంది.
కేవలం వినోదాన్ని నమ్ముకుని చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. అనిల్ రావిపూడి కామెడీకి చిరు వింటేజ్ మేనరిజమ్స్ తోడవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. గత సినిమా నష్టాలను ఈ సినిమా లాభాలతో బ్యాలెన్స్ చేయడం చూస్తుంటే ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనే మాట అక్షరాలా నిజమనిపిస్తుంది.
ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన ఊపుతో మెగాస్టార్ ఇప్పుడు తన పూర్తి ఫోకస్ ‘విశ్వంభర’పై పెట్టారు. ఒక డిజాస్టర్ తర్వాత ఈ రేంజ్‌లో ప్రాఫిట్స్ తీసుకురావడం కేవలం మెగాస్టార్‌కే సాధ్యమని అభిమానులు, ట్రేడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.


