అస్వస్థత పాలైన మురళీ మోహన్ ని పరామర్శించిన చిరంజీవి

Published on Jun 1, 2019 2:35 pm IST

నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ అస్వస్థతకు లోనయ్యారు. తన తల్లి అస్తికలు వారణాసిలో నిమజ్జనం చేస్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు.కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన హైదరాబాద్ కేర్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన వెన్నెముకకు గాయమైనట్లు నిర్ధారించిన కేర్ హాస్పిటల్ వైద్యలు శస్త్రచికిత్స చేశారు. గత వారం రోజులుగా కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మురళి మోహన్ నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యినట్లు సమాచారం.

మురళీమోహన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న చిరంజీవి దంపతులు… ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ మేరకు మురళీమోహన్ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన అభిమానులతోపాటు రాజమండ్రి ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, త్వరలోనే ప్రజలను కలుసుకునేందుకు రాజమండ్రి రానున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం :

More