సైరా నరసింహారెడ్డి విడుదలకు రెండు పది రోజుల సమయం కూడా లేదు. వచ్చే నెల 2న విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ సందర్బంగా ఈనెల 18న చిత్ర ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది. అలాగే గత ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా అభిమానుల మధ్య ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడం జరిగింది. టాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఇ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం పై సుదీర్ఘ ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా అనేక కీలక విషయాలు ప్రస్తావించిన చిరు మూవీ బడ్జెట్ గురించి కూడా మాట్లాడారు. లాభాపేక్ష లేకుండా ఈ చిత్రం అత్యున్నతంగా రావడానికి రాజీ పడకుండా ఖర్చు చేశాం అన్నారు.దర్శకుడి కోరిక మేరకు కోటలు, ప్యాలస్ ల సెట్టింగ్స్ మరియు వార్ ఎపిసోడ్స్ కొరకు భారీగా ఖర్చు చేయడం జరిగింది అన్నారు. ఐతే జార్జియా దేశంలో ఒక వార్ ఎపిసోడ్ ఒకటిన్నర నెలకు పైగా చిత్రీకరించాము, దాని కొరకు అక్షరాలా 75కోట్లు ఖర్చు చేశాం అని ఆయన చెప్పడం జరిగింది.
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తుండగా…,అమితాబ్,జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందించారు.


