పెద్ది ట్రైలర్ పై మెగాస్టార్ రివ్యూ.. చిరు లీక్ చేసిన మెగా డైలాగ్ ఇదే..!

పెద్ది ట్రైలర్ పై మెగాస్టార్ రివ్యూ.. చిరు లీక్ చేసిన మెగా డైలాగ్ ఇదే..!

Published on May 16, 2026 3:55 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. ఈ ప్రమోషనల్ కంటెంట్‌పై తన అభిప్రాయాలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ట్రైలర్‌లో చూపించిన మాస్ మ్యాడ్నెస్, ఎమోషన్, ఎలివేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయంటూ మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. చరణ్, బుచ్చిబాబు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తమ బెస్ట్ ఇచ్చారని, ట్రైలర్ అంచనాలకు మించి ఉందని కొనియాడారు.

​ఎప్పుడూ ఏదో ఒక సినిమా విషయాన్ని అధికారిక ప్రకటన కంటే ముందే లీక్ చేసే అలవాటున్న చిరంజీవి, ఈసారి కూడా అదే పని చేశారు. ‘పెద్ది’ ట్రైలర్ చూసి బాగా ఇంప్రెస్ అయిన ఆయన, అందులోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు” అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలవనుందని చిరు హింట్ ఇచ్చారు. మెగాస్టార్ స్వయంగా ఈ డైలాగ్ లీక్ చేయడంతో మెగా అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి.

​దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ భారీ ట్రైలర్‌ను మే 18న ముంబైలో జరగబోయే ఒక గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ సినిమాపై, చిరంజీవి చేసిన ట్వీట్ మరియు డైలాగ్ లీక్‌తో హైప్ మరింత పెరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు