నిన్న మహేష్, నేడు చిరు..!

Published on Apr 10, 2020 12:47 pm IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే కార్యక్రమంలో ప్రభుత్వాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. ఈ వైరస్ కి మందు అనేది లేకపోవడంతో వ్యాప్తిని అరికట్టాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని ప్రభుత్వాలు ప్రజలను ఇంటికే పరిమితం కావాలని కఠిన ఆంక్షలు పెడుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు సక్రమంగా అమలుగా కావడానికి, ప్రజలు బయటికి రాకుండా చేయడానికి పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు.

వీరి శ్రమను కొనియాడుతూ, కష్టానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియో సందేశం పంపారు. పోలీసుల నిరంతర శ్రమకు ఆయన సెల్యూట్ చేశారు. ఇక నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, కూడా తన ట్విట్టర్ ద్వారా తెలంగాణా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల త్యాగాన్ని గుర్తిస్తూ ఈ స్టార్ హీరోలు చేసిన వీడియోలు పోలీసుల గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More