‘సైరా’ మ్యూజిక్ డైరెక్టకి , చిరు బంపర్ ఆఫర్..?

Published on Jun 26, 2019 10:13 am IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్నభారీ చిత్రం “సైరా”. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ మూవీ గాంధీ జయంతి సంధర్బంగా అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ మూవీకి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించాల్సి ఉండగా, అది కుదరలేదు. మెగాస్టార్ మొదటిసారి ఈ మూవీకి స్వరాలు సమకూర్చే బాధ్యతను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అమిత్ త్రివేదికి అప్పగించారు. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈయనే సమకూరుస్తున్నారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ‘సైరా’ తర్వాత చిరంజీవి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న మూవీకి కూడా అమిత్ త్రివేదినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నారని సమాచారం.ప్రస్తుత సైరా మూవీ కొరకు ఆయన కంపోజ్ చేసిన బి.జి.ఎం విన్న చిరు ఇంప్రెస్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ ఆగస్టు చివరివారం లేదా అక్టోబర్ రెండవ వారంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం కలదు. ఈ మూవీలో చిరు సరసన శృతిహాసన్ నటించే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More