కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటివల విడుదలైన ఈ స్పెషల్ ప్రోమో ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తుంది. ఆగస్ట్ 7న చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ స్పెషల్ షో ప్రసారం అవుతుంది.
చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలసి ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి. అభిమానులు ఈ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బుల్లితెర(టీవీ) టి.అర్.పి రేటింగ్ లలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం నెంబర్ 1 స్థానంలో దూసుకుపోతుంది. చిరంజీవి స్పెషల్ ఎపిసోడ్ రోజున మిగతా కార్యక్రమాలకు అందనంత ఎత్తులో టి.అర్.పి రేటింగ్ నమోదు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొదట చిరంజీవి స్పెషల్ ఎపిసోడ్ ను చిరు బర్త్ డే నాడు ఆగస్ట్ 22న ప్రసారం చేయాలని భావించారు. అయితే ఆగస్ట్ 7వ తేదితో షో ముగించాలని నిర్మాతలు భావించడంతో ఆ రోజు చిరు ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తున్నారు. బుల్లితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అదే రేంజ్లో గ్రాండ్ ఎండింగ్ ఇవ్వబోతున్నారు.


