4K క్వాలిటీతో మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే..?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ చిత్రం 4K రీమాస్టర్డ్ వెర్షన్‌లో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి తీసుకొచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మాణంలో బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సరికొత్త 4K విజువల్స్ మరియు హై క్వాలిటీ ఆడియోతో యూట్యూబ్‌లో విడుదలైంది.

పవర్ ఫుల్ ఇంద్రసేనారెడ్డి పాత్రలో చిరంజీవి నటన, మణిశర్మ అందించిన బ్లాక్‌బస్టర్ సంగీతం మరియు బి. గోపాల్ మార్క్ మాస్ డైలాగ్స్ ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 4K ప్రింట్‌ను అభిమానులు యూట్యూబ్‌లో ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Exit mobile version