మెగాస్టార్ దృష్టిలో అసలు మెగాస్టార్ ఎవరో తెలుసా…?

Published on Aug 21, 2019 3:00 am IST

నేడు ముంబై వేదికగా సైరా టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ విడుదల అనంతరం సైరా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా ప్రశ్నలకు నటీనటులతో పాటు, దర్శక నిర్మాతలు సమాధానాలు చెప్పడం జరిగింది.

ఐతే ఓ విలేకరి చిరంజీవిని ఉద్దేశిస్తూ మొదటి సారి ఇద్దరు మెగాస్టార్స్ అయిన మీరు మరియు అమితాబ్ కలిసి చేశారు కదా, ఆ అనుభవం ఎలా ఉంది అని అడుగగా..,దీనికి సమాధానంగా చిరంజీవి ఆసక్తికరంగా స్పందించారు. నిజానికి ఉంది ఒకే ఒక్క మెగాస్టార్ అది అమితాబ్ గారు అని అన్నారు. అంత పెద్ద సీనియర్ స్టార్ నేను ఫోన్ చేసి సైరా లో పాత్ర గురించి చెప్పి.., మీరు చేయాలనీ అడుగగా నా మాటను మన్నించి అమితాబ్ గారు ఈ పాత్ర చేశారు. కాబట్టి మెగాస్టార్ ఒకరే అది అమితాబ్ గారే అని చిరు గొప్పగా సమాధానం చెప్పారు.

సంబంధిత సమాచారం :