బంగారు తల్లిని ప్రమోట్ చేయనున్న చిరంజీవి

బంగారు తల్లిని ప్రమోట్ చేయనున్న చిరంజీవి

Published on Nov 11, 2014 7:28 PM IST

na-bangaru-thali
61వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచినా సినిమా ‘నా బంగారు తల్లి’. ఈ సినిమాకి మొత్తంగా 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 2013 లో తెరకెక్కించిన ఈ సినిమాని నవంబర్ 21న రిలీజ్ చెయ్యనున్నారని ఇది వరకే తెలియజేశాం. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ మూవీ ఆడియోని కూడా రిలీజ్ చేసారు. ఇప్పుడు మీకు మరో ఆసక్తికరమైన విషయాన్ని మేము అందిస్తున్నాం.

ఇదొక నేషనల్ అవార్డు ఫిల్మ్ కావున దీనిని చూడటానికి పెద్దగా ప్రేక్షకులు మక్కువ చూపకపోవచ్చు అందుకే.. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో భాగం అయ్యి, ప్రచార భాద్యతలు తీసుకోనున్నారు. త్వరలోనే చిరంజీవి ఈ సినిమాకి సంబందించిన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నాడు. ఓ సామాజిక సమస్య చుట్టూ తిరిగే ఈ సినిమాకి రాజేష్ డైరెక్టర్. ఈ మూవీలో సిద్దిక్, అంజలి పాటిల్, రత్న శేఖర్ రెడ్డి, లక్ష్మీ మీనన్, నీనా కురుప్ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజా వార్తలు