చిరు నెక్స్ట్ అవకాశం ఇచ్చేది అతనికేనా ?

Published on Jun 30, 2021 11:47 pm IST

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జాబితాలో ముగ్గురు దర్శకులు ఉన్నారు. వారే మెహర్ రమేష్, మోహన్ రాజా, రవీంద్ర బాబీ. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ పూర్తికాగానే ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం ఇస్తారు అని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో మోహన్ రాజాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన. మోహన్ రాజా చేయనున్నది ‘లూసిఫర్’ రీమేక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మోహన్ రాజా తమన్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడ మొదలుపెట్టారు. మరి ఈ చిత్రం పూర్తయ్యాక ఎవరికి అవకాశం ఇస్తారనేది ప్రశ్నగా మారింది.

మెహర్ రమేష్, బాబీ ఇద్దరూ సిద్దంగానే ఉన్నారు. వీరిలో మెహర్ రమేష్ అయితే ‘వేదాళం’ కథకు అన్ని మార్పులు చేసి చిరు కాల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ‘లూసిఫర్’ రీమేక్ చిత్రమే కాబట్టి తర్వాతది కూడ రీమేక్ సినిమానే అనుకున్నారో ఏమో కానీ బాబీ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈమేరకు బాబీ ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారట. ఇప్పటికే కాస్టింగ్ పనులు కూడ స్టార్ట్ చేసి నవాజుద్దీన్ సిద్ధికీ లాంటి స్టార్లను సంప్రదిస్తున్నారట. దీన్నిబట్టి మెహర్ రమేష్ ప్రాజెక్ట్ ఇంకాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :