మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు వశిష్ట మల్లిడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో ముగిసింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్ర కథను మరింత ఎఫెక్టివ్‌గా మార్చడంతో పాటు, క్లైమాక్స్‌కు మరింత బలాన్ని చేకూర్చడం కోసం చిత్ర బృందం అదనంగా ఒక సీక్వెన్స్ చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని కోసం చిరంజీవి మరో నాలుగు నుండి ఐదు రోజుల పాటు కాల్‌షీట్లు కేటాయించనున్నాడట. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ‘విశ్వంభర’ షూటింగ్ అధికారికంగా ముగుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీ నేతృత్వంలో రూపొందుతున్న తన నెక్స్ట్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షెడ్యూల్ మధ్యలో దొరికే చిన్న విరామంలో ఆయన ‘విశ్వంభర’ మిగిలిన భాగాన్ని పూర్తి చేయనున్నాడు. ఆ తర్వాత తన పూర్తి దృష్టిని మళ్లీ బాబీ ప్రాజెక్ట్‌పైనే పెట్టనున్నాడు.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.


