వీలుచేసుకుని మరీ సినిమా చూసిన చిరు

Published on Mar 16, 2020 9:17 am IST

మెగాస్టార్ చిరంజీవి ఇతర చిత్రాలకు తన పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. చిన్న, పెద్ద చిత్రాలు అనే తేడా లేకుండా ఆహ్వానించిన ప్రతి ఒక్కరి సినిమా కార్యక్రమానికి వెళుతున్నారు. అంతేకాదు సినిమాలు విడుదలయ్యాక వీలుచేసుకుని మరీ స్పెషల్ షోలు చూసి చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. తాజాగా ఆయన నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రాన్ని వీక్షించారు. ఆయనతోపాటు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల కూడా ఉన్నారు.

సినిమా చూసిన చిరు దర్శకుడిని, చిత్ర బృందాన్ని అభినందించారట. ఈ సంధర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ చిరంజీవిగారితో కలిసి సినిమా చూడటం అనేది నా కల. అది ఈరోజు నిజమైంది. మా సినిమాను చూసి, అభినందించినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఈ సందర్భాన్ని జీవితం మొత్తం గుర్తుంచుకుంటాను అన్నారు. ఇకపోతే చిరు కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణను కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభుత్వం ఎప్పుడైతే తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయవచ్చని ఉత్తర్వుల ఇస్తుందో అప్పుడు రీస్టార్ట్ చేస్తారు.

సంబంధిత సమాచారం :

More