ఇంత బిజీలో కూడా అబ్బాయ్ కోసం డాడీ వచ్చాడే…!

ఇంత బిజీలో కూడా అబ్బాయ్ కోసం డాడీ వచ్చాడే…!

Published on Sep 25, 2019 8:07 AM IST

ఒక ప్రక్క సైరా మూవీ విడుదల దగ్గర పడుతుండటంతో రిలీజ్ కార్యక్రమాల పర్యవేక్షణతో పాటు, ప్రచార కార్యక్రమాలలో బిజీ గా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా మూవీ పలు భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానున్న నేపథ్యంలో హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ అనేక విషయాలలో తలమునకలై ఉన్నారు. కానీ ఇంత బిజీ షెడ్యూల్ లో అబ్బాయి వరుణ్ కోసం తన విలువైన సమయాన్ని కేటాయించారు చిరంజీవి. నిన్న ఆయన వరుణ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం చూసి, వరుణ్ మరియు దర్శకుడు హరీష్ అలాగే చిత్ర నిర్మాతలను అభినందించడంతో పాటు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

దీనితో చిత్ర యూనిట్ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. గత వారం విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు, మంచి వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా వరుణ్ నటనకు, అలాగే డైరెక్టర్ హరీష్ టేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. పూజ హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ కీలక పాత్ర చేయడం జరిగింది. 14రీల్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు