మెగాస్టార్ ముఖ్య అతిధిగా ‘గోవిందుడు..’ టీజర్ లాంచ్..!

Published on Jul 25, 2014 3:20 am IST

chiranjivi-ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ సినిమాల ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క టీజర్ ఈ నెల 29న రంజాన్ కానుకగా అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. జూలై 28 దర్శకుడి పుట్టినరోజు కావడం విశేషం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయనున్న ఈ కార్యక్రమం హైదరాబాద్ నానకరామ్ గూడా రామానాయుడు స్టూడియోస్ లో నిర్వహిస్తున్నారు. పోనీ టైల్ లో కనిపిస్తున్న రామ్ చరణ్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సంబంధిత సమాచారం :