మేనల్లుడి సినిమా కోసం చిరంజీవి !
Published on Jun 6, 2018 10:16 am IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్ యు’. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని పనుల్ని ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ఆడియో వేడుకను ప్లాన్ చేసింది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరుస పరాజయాల్లో ఉన్న తేజ్ కు ఈ చిత్రం చాలా కీలకంగా మారింది. ఫస్ట్ లుక్, టీజర్ బాగుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయమే ఉంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదలచేయనున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook