చిరు అతనికి మరొక ఛాన్స్ ఇస్తున్నారా ?

Published on Jun 27, 2019 10:56 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అమిత్ వర్క్ చిరుకు బాగా నచ్చిందట. హిస్టారికల్ మూవీకి మంచి సంగీతం చేయగలిగిన త్రివేది కమర్షియల్ సినిమాకు కూడా న్యాయం చేయగలడని భావిస్తూ తన 152వ చిత్రానికి కూడా అతనినే తీసుకోవాలని అనుకుంటున్నారట చిరు.

అయితే కొరటాల శివ డైరెక్ట్ చేసిన సినిమాలన్నిటికీ దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందించారు. వారిద్దరికీ చాలా మంచి సింక్ ఉంటుంది. అలాంటి దేవిని పక్కనబెట్టి చిరు మాట మేరకు త్రివేదికి కొరటాల ఓకే చెప్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. ఇకపోతే సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండనున్న ఈ సినిమా ఆగష్టు 22న అనౌన్స్ అయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More