మెగాస్టార్ ను కాపాడబోతున్న చరణ్ !

Published on Mar 29, 2021 6:53 am IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో మెగాస్టార్ పై అటాక్ జరుగుతుందని.. పోలీసులు చేసే ఆ అటాక్ లో చిరు ప్రాణాలను ఆ పోలీసుల్లో ఒక్కడైన చరణ్ కాపాడుతాడని.. ఈ సీన్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. అంటే.. వృత్తి పరంగా చరణ్ పోలీస్ అయినప్పటికీ.. చిన్నప్పటి నుండి ఆచార్యకి అభిమాని అట.

ఆచార్య చేసిన సాయం వల్లే తనలా వందల మంది ఉన్నత చదువులు చదువుకుని గొప్ప స్థాయికి వెళ్లారని.. అందుకే చరణ్ పాత్ర తన జీవితాన్ని పణంగా పెట్టి, ఆచార్యను సేవ్ చేస్తాడట. ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :