‘ఆచార్య’ ఇంటర్వెల్ కోసం మెగాస్టార్.. !

‘ఆచార్య’ ఇంటర్వెల్ కోసం మెగాస్టార్.. !

Published on Dec 13, 2020 2:00 AM IST

Acharya1

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’ షూటింగ్ కి మెగాస్టార్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ లో చిరు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే.

పైగా ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారని కూడా టాక్ ఉంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. జనవరి నుండి ఫిల్మ్ సిటీలో మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొననుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు