భారీ ధరకు అమ్ముడైన ‘ఆచార్య’ హక్కులు.. కొన్నది ఎవరంటే..

భారీ ధరకు అమ్ముడైన ‘ఆచార్య’ హక్కులు.. కొన్నది ఎవరంటే..

Published on Feb 4, 2021 8:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతుండటంతో ఈ సినిమా మీద బిజినెస్ వర్గాల్లో సైతం విపరీతమైన హైప్ నెలకొని ఉంది. ఈ హైప్ కారణంగానే చిత్ర హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా యొక్క నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులు 40 కోట్ల రూపాయల భారీ మొత్తానికి పైగా అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇందులో 36 కోట్లు నాన్ రీఫండబుల్ అమౌంట్.

‘క్రాక్’ సినిమా నైజం హక్కులను కొన్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పట్టుబట్టి మరీ గట్టి పోటీ నడుమ ఈ హక్కులను ఇంత పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారట. ‘బాహుబలి 2, సాహో’ తర్వాత నైజాంలో అత్యధిక ధరకు అమ్ముడైన హక్కులు ఇవే కావడం విశేషం. చిరు కెరీర్లో ఇదే హయ్యస్ట్ నైజాం ధర. ఇక మిగిలిన ఏరియాల్లో కూడ సినిమాను పెద్ద మొత్తం వెచ్చించి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో సినిమా బిజినెస్ 100 కోట్లు దాటి ఉంటుందనే అంచనా ఉంది. దీన్నిబట్టి సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను మే 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు