టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన కెరీర్‌లో ఒక అరుదైన ఫీట్ నమోదైంది. శ్రీవిష్ణు నటించిన రెండు వైవిధ్యమైన చిత్రాలు ఒకే నెలలో విడుదలకు సిద్ధమవ్వడమే కాకుండా, వాటి డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘విష్ణు విన్యాసం’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అలాగే, ఆయన నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మృత్యుంజయ’ ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ రెండు సినిమాల ఓటీటీ డీల్స్ ఫ్యాన్సీ రేటుకు కుదరడం విశేషం.
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సాగుతున్న డ్రై పీరియడ్‌లో కూడా శ్రీవిష్ణు సినిమాలకు ఇంతటి క్రేజ్ ఉండటం చూస్తుంటే, ఆయన మార్కెట్ స్టామినా ఏంటో అర్థమవుతోంది. ఈ రెండు చిత్రాలు ఈ నెలలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. తనదైన కామెడీ టైమింగ్‌తో ‘విష్ణు విన్యాసం’ అలరిస్తుందని, ‘మృత్యుంజయ’తో ఒక డిఫరెంట్ థ్రిల్లర్ అనుభూతిని ఇస్తానని శ్రీవిష్ణు ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేస్తున్నాడు.


