వింటేజ్ మాస్ మెగాస్టార్… సోషల్ మీడియాలో వైరల్

Published on Jul 14, 2019 4:10 pm IST

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎంతటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పటికీ ఇప్పటికీ ఆయన స్థాయి కొంచెం కూడా తగ్గలేదు. ఏంతో మంది యువ హీరోలు వచ్చినా నెంబర్ 1 స్థానాన్ని ఆయనకే ఇచ్చేశారు ప్రేక్షకులు. సోషల్ మీడియాలో సైతం నిత్యం ట్రెండ్ అవుతున్నారాయన. త్వరలో ‘సైరా’ చిత్రం విడుదల ఉండటంతో ఆయన అభిమానుల హడావుడి బాగా ఎక్కువైంది.

ఎలా బయటికి తెచ్చారో తెలీదు కానీ చిరు యొక్క పాత ఫోటోలు కొన్నిటిని సోషల్ మీడియాలో పెట్టారు ఆయన అభిమానులు. వాటిలో యుక్త వయసులో ఉన్న చిరంజీవి యొక్క మాస్ స్టిల్స్ ఉన్నాయి. ఇంటర్నెట్లో ఏనాడూ కనబడని ఈ ఫోటోలు కొత్తగా దర్శనమివ్వడంతో అభిమానులు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలు ఏమిటి మీరు కూడా ఒక లుక్ వేయండి. ఇకపోతే సురేందర్ రెడ్డి దర్సకత్వంలో రూపొందుతున్న ‘సైరా’ అక్టోబర్ 2న విడుదలకానుండగా దాని తరవాత కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలుపెట్టానున్నారు చిరంజీవి.

సంబంధిత సమాచారం :

More