1992లో చిరు రెమ్యూనరేషన్ తెలుసా…!

1992లో చిరు రెమ్యూనరేషన్ తెలుసా…!

Published on Aug 22, 2019 11:12 AM IST

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ హీరో మెగాస్టార్ చిరంజీవి నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. 1955 ఆగస్టు 22న జన్మించిన చిరంజీవి 64వ వసంతంలోకి ప్రవేశించారు. తెలుగు పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగిన చిరు, ఎన్టీఆర్ తరువాత టాప్ పొజిషన్ దక్కించుకొని దశాబ్ధాలపాటు కొనసాగారు. ఐతే చిరు స్టార్ డమ్ 90లలో పీక్ చేరింది. ఆ టైములోనే ఆయన నుండి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ అయిన కొండవీటి దొంగ, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి చిత్రాలు రావడం జరిగింది.

అదే టైం లో ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజ్, ది జెంటిల్మెన్ వంటి హిందీ చిత్రాలు కూడా ఆయన చేయడం జరిగింది. 1992 లో ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ది వీక్ చిరు కవర్ పేజీ తో ఓ ఆర్టికల్ ప్రచురించింది. దాని ప్రకారం అప్పట్లోనే చిరు 1.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవారట. ఇది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పారితోషకం కంటే ఎక్కువని వారు చెప్పడం జరిగింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రాల హీరో రెమ్యూనరేషన్ జాతీయ స్థాయి హీరో కంటే ఎక్కువ ఉండటం అరుదైన ఫీట్ గా చెప్పుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు