మెగాస్టార్ చిరు ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాకముందే చిరంజీవి 152వ సినిమాపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి.
ఒకసారి చిరు తర్వాతి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తారని వార్తలురాగా ఇంకోసారి సుకుమార్, త్రివిక్రమ్ ల పేర్లు వినబడ్డాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని, అవన్నీ స్పెక్కులేషన్స్ మాత్రమేనని, అన్నీ కుదిరాక తానే స్వయంగా ప్రకటిస్తానని చెప్పారట. అంతేగాక వైజయంతిలో మూవీస్ బ్యానర్లో ‘పాతాళభైరవి’ లాంటి సినిమా చేయాలనుంది, నాగ్ అశ్విన్ కూడ నా కోసం కథ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అన్నీ సెట్టైతే దత్ గారితో సినిమా చేయడానికి రెడీ అని అన్నారట.


