అదిరిపోయే ట్విస్ట్, చిరు,చరణ్ హీరోలుగా కొరటాల మూవీ

Published on Oct 8, 2019 10:32 am IST

దసరా పండుగ నాడు మెగా ఫ్యాన్స్ కి చిరు-చరణ్ అదిరిపోయే న్యూస్ అందించారు. వీరిద్దరూ కలిసి మూవీ చేస్తున్నట్లు ప్రకటించి బంపర్ ట్విస్ట్ ఇచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఆ చిత్రంలో మరో హీరోగా చరణ్ కూడా చేస్తున్నారనే విషయాన్ని నేడు బహిర్గతం చేసి సినీ వర్గాలతో పాటు, మెగా అభిమానులకు షాక్ ఇచ్చారు. నేడు హైదరాబాద్ లో అధికారికంగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఎప్పటినుండో చిరంజీవి రామ్ చరణ్ కలిసి మూవీ చేయాలని ఫ్యాన్ కోరుకుంటున్న నేపథ్యంలో నేటి ప్రకటనతో వారి కోరిక తీరినట్లయింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన మగధీర, బ్రుస్లీ వంటి చిత్రాలలో గెస్ట్ గా కనిపించిన పూర్తి స్థాయి పాత్ర చేసింది లేదు. మ్యాట్నీ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా రానున్న ఈ మూవీలోని నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More