ఆ క్షణాల్ని ఆస్వాదిస్తున్న చిరు, చరణ్

Published on Mar 2, 2021 1:10 am IST

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే చూడాలనేది మెగా అభిమానులకు ఎప్పటి నుండో ఉన్న పెద్ద కోరిక. ఆ కోరిక ‘ఆచార్య’తో నెరవేరబోతోంది. చరణ్, చిరులకు కూడ కలిసి సినిమా చేయాలనే ఆశ ఎప్పటి నుండో ఉంది. మంచి కథ దొరికితే రెడీ అని అనేక సందర్భాల్లో చెప్పారు ఇద్దరూ. ‘ఆచార్య’తో దాన్ని సాధ్యం చేశారు కొరటాల శివ. తండ్రీ కొడుకులను వెండి తెర మీద కలిపి చూడటానికి అభిమానులు ఎంత ఆశగా ఉన్నారనేది పక్కనపెడితే కలిసి నటిస్తున్నందుకు చిరు, చరణ్ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు.

నాన్నతో కలిసి నటించిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చరణ్ అంటే నా కొడుకు నా కామ్రేడ్ అవడం ఎంతో అందమైన క్షణం అంటూ మురిసిపోయారు చిరు. వీరి మాటల్ని వింటే కలిసి నటించడంలో ఉన్న ఆనందాన్ని ఇద్దరూ ఎంతగా ఆస్వాదించారో అర్థమవుతోంది. మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదలచేయనున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు కథానాయికలుగా నటిస్తున్నారు. సీనియర్ కంపోజర్ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :