మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున చాలా మంచి స్నేహితులు. సమయం దొరికినప్పుడల్లా కలుస్తూ ఉంటారు ఇద్దరూ. ఎక్కువగా కుటుంబ వేడుకల్లో కలిసి కనిపిస్తుంటారు. నాగార్జున ఈరోజు చిరు ఇంటికి డిన్నర్ చేయడానికి వెళ్లారు. ఇందులో వింతేమిటి అనుకోకండి. ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసింది స్వయానా మెగాస్టార్ చిరునే. రేపు ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ సందర్బంగా నాగార్జున కోసం చిరు రుచికరమైన భోజనం వండారట. ఆ ఫోటోలను నాగార్జున స్వయంగా షేర్ చేశారు.
‘వైల్డ్ డాగ్’ రిలీజ్ టెంక్షన్ నుండి నన్ను కూల్ చేయడానికి మెగాస్టార్ స్వయంగా నాకు డిన్నర్ వండి పెట్టారు. ఈ అద్భుతమైన సాయంత్రానికి చాలా థ్యాంక్స్ చిరు అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు నాగ్. చిరు మొదటి నుండి ‘వైల్డ్ డాగ్’ విషయంలో నాగార్జునకు తన సహకారం అందిస్తూ ఉన్నారు. రెండు వారాల క్రితం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి నాగార్జున మీద ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ రిలీజ్ సందర్బంగా నాగ్ చిరుతో జరిపిన వాట్సాప్ సంభాషణను నెటిజన్లతో పంచుకున్నారు కూడ.
