చిరు ఈ అప్డేట్స్ ఇవ్వడం ఆపేయాలి.

Published on Apr 9, 2020 12:31 pm IST

సినిమాకు రహస్యం అనేది మంచి వ్యాపార మూలకం. ఈ సినిమాలో ఏమి చూపించబోతున్నారు? సినిమా దేని గురించి అయి ఉండొచ్చు అనే ఆసక్తి ప్రేక్షకులలో కలిగించాలి. సినిమా గురించి అన్ని విషయాలు బయటికి తెలిసిపోతే ప్రేక్షకులకు మజా ఏమి ఉండదు. అందుకే మూవీ మేకర్స్ కేవలం చెప్పాల్సిన వరకే చెవుతారు, చూపించాల్సిన వరకే చూపిస్తారు. ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న చిరంజీవికి ఈ చిన్న లాజిక్ తెలియనిది కాదు. కానీ ఈ మధ్య ఈ విషయం మరిచిపోయి వేదికలపై తన సినిమా గురించి కీలక విషయాలు చెప్పేస్తున్నారు.

ఓ వేడుకలో మాట్లాడుతూ చిరంజీవి ఈ మూవీ టైటిల్ లీక్ చేశేశారు. ఆచార్య అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించకుండానే ఆయన చెప్పడం జరిగింది. ఆయన తేరుకొనే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలాగే ఈ చిత్రంలో చరణ్ రోల్ గురించిన కీలక సంగతులు కూడా చిరు చెప్పేస్తున్నారు. ఇది ఒకింత దర్శకుడిని ఇబ్బంది పెట్టే అంశమే. ఇకనైనా చిరంజీవి ఆచార్య అప్డేట్స్ ఇవ్వడం ఆపేస్తే బెటర్. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More