రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్ చిరు.?

రామ్ చరణ్ సినిమాలో మెగాస్టార్ చిరు.?

Published on Jul 25, 2015 1:37 PM IST

Ram-charan-Chiranjeevi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం హైదరబాద్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న ఈ చిత్ర టీం రేపటి నుంచి బ్యాంకాక్ లో ఫ్రెష్ షెడ్యూల్ ని మొదలు పెట్టనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా, ఓ ఫేమస్ తెలుగు హీరోకి డూప్ గా కనిపించనున్నాడు. తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. శ్రీను వైట్ల ఈ సినిమాలో ఓ స్పెషల్ ఫిల్మ్ స్టార్ పాత్ర కోసం ఎవరిని అడగాల అని ప్రయత్నిస్తున్న టైంలో రామ్ చరణ్ చిరు పేరు చెప్పినట్లు సమాచారం.

ఈ ఐడియాపై చిరు కూడా సముఖతగానే ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం చిరు – చరణ్ ల మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయట. రామ్ చరణ్ మగధీర సినిమా మొదట్లో ఓ కొద్దిసేపు తెరపై కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన చిరంజీవి ఆ తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. మళ్ళీ రామ్ చరణ్ సినిమాతోనే మరోసారి తెరపై కనిపించనుండడం విశేషం. మరోవైపు చరణ్ చిరు నటించనున్న 150వ సినిమా స్క్రిప్ట్ పనులను కూడా పూర్తి చేయిస్తున్నాడు. ఆ సినిమా కూడా ఇదే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృతి కర్భంద, నదియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీకి డివివి దానయ్య నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు