చిరు – కొరటాల మూవీ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 25, 2019 6:46 am IST

మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుందట. ఇక డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది.

కాగా చిరు కోసం కొరటాల ఓ సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More