అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట – మెగాస్టార్

అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట – మెగాస్టార్

Published on Aug 10, 2020 10:26 AM IST

మెగాస్టార్ చిరంజీవి వంటలను కూడా చ‌క్క‌గా వండుతారు. ముఖ్యంగా ఆయనకు సీఫుడ్ అంటే బాగా ఇష్టమట. సీ ఫుడ్ లో చేపల ఏపుడు అంటే మరీ ఇష్టమని.. అందుకే ఆయన ‘అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట’ అంటూ వంటలోని తన నైపుణ్యాన్ని చూపించారు ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు…’ చేశానంటూ చిరు.. ఆ వంట తాలూకు వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఇక కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెగా సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు