పవన్, చిరంజీవి కలిసి నటించడానికి రెడీ.., దర్శకులకు ఓపెన్ ఆఫర్..!

Published on Oct 8, 2019 7:04 am IST

సైరా నరసింహారెడ్డి ఘన విజయం నేపథ్యంలో నిన్న సైరా చిత్ర యూనిట్ మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి తోపాటు నటుడు రవి కిషన్, సాయి చంద్, రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు యూనిట్ సభ్యులు సమాధానాలు చెప్పడం జరిగింది. ఒకరు చిరుని మంచి సోషల్ అండ్ పొలిటికల్ కాన్సెప్ట్ ఉన్న కథతో వస్తే పవన్ కళ్యాణ్ గారితో కలిసి మూవీ చేస్తారా? అని అడుగగా చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

మంచి స్క్రిప్ట్ తో దర్శకులు వస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్దమే అని ఆయన కుండ బద్దలు కొట్టారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయలకే అంకితం అని చెబుతున్న నేపథ్యంలో చిరు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఐతే సమకాలీన రాజకీయ పరిస్థితులు, సోషల్ మెస్సేజ్ కలిగిన సినిమాలు పవన్ పొలిటికల్ కెరీర్ కి కూడా ఉపయోగపడే అవకాశం ఉండటంతో ఆయన మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా చిరు స్టేట్మెంట్ పవన్ ని మరో మారు తెరపై చూడాలనుకుంటున్న అభిమానుల ఆశకు ఊపిరి పోసింది.

సంబంధిత సమాచారం :

More