అల్లు అరవింద్ తో విభేదాలా.. నో ఛాన్స్-చిరు

Published on Apr 10, 2020 2:56 pm IST

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో మెగాస్టార్ చిరంజీవికి విభేధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని కొంత కాలంగా మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. తాజా ఇంటర్వ్యూ లో చిరంజీవి దీనిపై స్పష్టత ఇచ్చారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ అల్లు అరవింది మా కుటుంబంలోని సభ్యుడు. మేమందరం ఎప్పుడూ కలిసి కట్టుగా ఉంటాం. కొన్ని కీలక నిర్ణయాల విషయంలో ఒకరి సలహాలు మరొకరం తీసుకుంటూ ఉంటాం. అరవింద్ తో నాకు విభేదాలు ఉన్నాయనేది పూర్తిగా అవాస్తం అన్నారు.

ఇంకా మాట్లాడుతూ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు ఎలా పుట్టుకొస్తాయో తెలియదు. గతంలో కూడా నాకు తమ్ముడు పవన్ కళ్యాణ్ కి విభేదాలు తలెత్తాయని పుకార్లు పుట్టించారు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోను మరియు స్పందిచను అన్నారు. కాగా చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More