నాకు’ఖైదీ’ విజయ్ దేవరకొండ కు ‘గీత గోవిందం’ – చిరంజీవి !

నాకు’ఖైదీ’ విజయ్ దేవరకొండ కు ‘గీత గోవిందం’ – చిరంజీవి !

Published on Aug 19, 2018 10:38 PM IST

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా పరుశరాం దర్శకత్వంలో గీత ఆర్ట్స్ 2పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన చిత్రం గీత గోవిందం. ఇటీవల విడదలై అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఈసంధర్బంగా చిత్ర యూనిట్ ఈరోజు విజయోత్సవ సభను నిర్వహించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నాకు ఈ రోజు సైరా షూటింగ్ వున్నా దాన్ని కాదనుకొని విజయ్ కోసం ఈ ఫంక్షన్ కు వచ్చాను. ఈచిత్రం ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది. ఈ లాంటి సినిమాను మా గీత ఆర్ట్స్ సంస్థ కు అందించిన డైరెక్టర్ పరుశురాం గారికి ధన్యవాదాలు. అలాగే సినిమా కథను నమ్మి ఇంత అద్భుతంగా నిర్మించారు బన్నీ వాసు ఆయన నిర్మాత మరింత గొప్ప స్థాయికి చేరుకుంటారు.

ఇక ఈచిత్ర హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో అన్ని వర్గాలకు చేరువకాలేకపోయిన ఈసినిమాతో అన్నివర్గాల ప్రేక్షకులను అలరించాడు. ఖైదీ సినిమా నన్ను స్టార్ హీరోను చేస్తే ఈ గీత గోవిందం విజయ్ ను స్టార్ హీరోగా మార్చింది. అలాగే చిత్రంలో నటించిన రష్మిక, కిశోర్ , రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణ అద్భుతంగా నటించారని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు