చిరు ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నారా ?

చిరు ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నారా ?

Published on May 31, 2018 5:28 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి రెండు సినిమాలు చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. గతేడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా’ చిత్రాన్ని మొదలుపెట్టారు చిరు. సినిమాను భారీ స్థాయిలో నిర్మించాలని, జాతీయ స్థాయి సినిమాగా తీర్చిదిద్దాలని టీమ్ భావిస్తుండటంతో సినిమాకు ఇంకా చాలా సమయం పట్టనుంది.

మరోవైపు కొరటాల శివ ప్రాజెక్ట్ కూడ చిరు ఒప్పుకొని ఉన్నారని, ఇంకొన్ని నెలలో దాన్ని మొదలుపెట్టాల్సి ఉంటుందని, కాబట్టి చిరు ఒకేసారి రెండు సినిమాల్ని చేయక తప్పేలా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల మేరకు నిజంగానే చిరు కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా, ఇస్తే రెండూ ఒకేసారి చేస్తారా లేదా అనేది మెగా కాంపౌండ్ నుండి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత తేలనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు