మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత చేస్తున్న తన 9వ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా విషయంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా దసరా కానుకగా సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఇటీవల్ థాయ్ ల్యాండ్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకొని వచ్చిన ఈ చిత్ర టీం ప్రస్తుతం హైదరాబాద్లో రామ్ చరణ్, ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఆగష్టు 22న రామ్ చరణ్ 9వ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారని ఇది వరకే తెలియజేయనున్నాం. కానీ అదే టీజర్ ని చిరంజీవి లాంచ్ చేస్తే.. అది కూడా అభిమానుల సమక్షంలో రిలీజ్ చేస్తే.. కన్నుల పండుగగా ఉంటుంది కదూ..
అలాంటి సంఘటనే ఈ రోజు చోటు చేసుకోనుంది. ఈ చిత్ర డైరెక్టర్ శ్రీను వైట్ల ‘రామ్ చరణ్ 9వ సినిమా ఫస్ట్ టీజర్ ని ఈ రోజు సాయంత్రం అభిమానుల సమక్షంలో జరగనున్న చిరంజీవి బర్త్ డే వేడుకలో స్వయంగా చిరంజీవి రిలీజ్ చేయనున్నారని’ తెలియజేశాడు. ఫస్ట్ టీజర్ పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది. ఇదే డేట్ కి తేదీని కూడా అనౌన్స్ చేద్దాం అనుకున్నారు కానీ టైటిల్ ని మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఇటీవలే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్య ప్రాత్రలో కనిపించనున్నాడని కూడా సమాచారం అందించాము. గోపి మోహన్ – కోన వెంకట్ కలిసి కథని అందించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం మెరుపు, బ్రూస్ లీ, ఫైటర్, విజేత అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.


