సాహో దర్శకుడిపై చిరుకి అంత నమ్మకమా?

Published on Apr 10, 2020 8:17 am IST

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ నుండి రామ్ చరణ్ ఎప్పుడో సొంతం చేసుకున్నారు. దీనితో ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే సందేహం ప్రేక్షకులలో మొదలైంది. ఐతే తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి దీనిపై స్పష్టత ఇచ్చారు. లూసిఫర్ తెలుగు రీమేక్ కి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తారట. ఇప్పటికే చిరంజీవి తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని సుజీత్ తో చెప్పారట. సుజీత్ తెలుగు నేటివిటీకి దగ్గరగా లూసిఫర్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని ఆయన చెప్పారు.

గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మిశ్రమ ఫలితాలను అందుకుంది. తెలుగులో ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. హిందీలో మాత్రం హిట్ అందుకుంది. అయినప్పటికీ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికే ఈ మూవీ రీమేక్ బాధ్యతలు అప్పగించాడట. ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య మూవీలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More