మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా విజేత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ఇక అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం ఎప్పుడు ? డైరెక్టర్ ఎవరు ? అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా తాజాగా కళ్యాణ్ దేవ్ తన రెండువ చిత్రానికి సైన్ చేశారు. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ తన రెండువ సినిమాని చేయనున్నాడు.
ఈ చిత్రం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నారు.


