తన పార్ట్ పూర్తి చేసిన ‘కళ్యాణ్ దేవ్’ ?

తన పార్ట్ పూర్తి చేసిన ‘కళ్యాణ్ దేవ్’ ?

Published on Sep 11, 2019 9:03 PM IST

నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ గత ఏడాది తన రెండువ సినిమాని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే చిత్రబృందం ఇటీవలే ఇప్పటివరకు చిత్రీకరించిన ఫుటేజ్ ను చూసి.. స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేస్తే బాగుంటుందని భావించిన టీం.. షూటింగ్ కి విరామం ఇచ్చి.. స్క్రిప్ట్ పై మరియు డైలాగ్‌ లపై వర్క్ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్ట్ వర్క్ చాల బాగా వచ్చిందని సినిమాలో కామెడీ చాల బాగుంటుందట. అయితే ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టిన చిత్రబృందం.. ఈ సినిమాలో తన పార్ట్ కి సంబంధించిన పార్ట్ ను పూర్తి చేశారట.

ఇక ఈ చిత్రం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ఇక అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రం పై కూడా మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు