
స్వర్గీయ ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘ఫిట్టింగ్ మాస్టర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముంబై భామ మదాలస శర్మ. ఆ తర్వాత మదాలస శర్మ ‘ఆలస్యం అమృతం విషం’, ‘మేం వయసుకు వచ్చాం’ సినిమాల్లో కనిపించింది. తాజాగా ఈ భామ ఓ స్పెషల్ రోల్ చేసిన ‘రామ్ లీల’ ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మదాలస శర్మ చెప్పిన విశేషాలు మీకోసం..
ప్రశ్న) టాలీవుడ్ ద్వారా మొదలైన మీ ప్రస్థానం ఎలా సాగుతోంది.?
స) అవునండి., మీరన్నట్టు ముంబై భామనైన నేను తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యాను. ప్రస్తుతం ఓ హీరోయిన్ గా, కెరీర్ పరంగా చాలా హ్యాపీ గా ఉన్నాను. తెలుగు తర్వాత కన్నడ, పంజాబీ, జర్మన్, హిందీ భాషల్లో నటించాను. ఇటీవలే నేను చేసిన ఓ ఇంగ్లీష్ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది, అది రిలీజ్ అయితే ఇంటర్నేషనల్ గా గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను.
ప్రశ్న) హీరోయిన్ గా సినిమాలు చేసిన మీరు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే చేయడానికి గల కారణం.?
స) అవును నేను ఈ సినిమాలో భజన భజన అనే ఓ స్పెషల్ సాంగ్ లో మాత్రమే కనిపిస్తాను. నా పరంగా నటి అంటే ఎలాంటి పాత్రలైనా చేయాలి. ప్రాత్ర చిన్నదైనా నటిస్తే మంచి పేరు వస్తుంది అంటే ఆ రోల్ చేస్తాను. ఈ సాంగ్ అలా పేరు తెచ్చి పెట్టేదే, అందుకే చేసాను.
ప్రశ్న) యంగ్ హీరో హవీష్, డైరెక్టర్ కిరణ్ తో పని చేసిన అనుభవం ఎలా ఉంది.?
స) మామూలుగా సెట్స్ పైన ఎవరైనా కాస్త టెన్షన్ పడతారు, ఎందుకంటే ఏ సీన్ ఎలా చెయ్యలా అనే రిహార్సల్స్ చేస్తుంటాం. కానీ హవీష్ మాత్రం చాలా బిందాస్ గా ఉంటాడు., దానికి కారణం సెట్స్ కి రాకముందే హవీష్ చాలా ఎక్కువగా హోం వర్క్ చేస్తాడు. సినిమా కోసం కోసం చాలా కష్టపడే తత్త్వం ఉన్నవాడు. ఇక డైరెక్టర్ కిరణ్ చాలా సైలెంట్ గా ఉండే ఫుల్ పాజిటివ్ పర్సన్. అవకాశం వస్తే అతనితో మరో సినిమా చేయాలని ఉంది.
ప్రశ్న) కెరీర్ మొదట్లో వరుసగా తెలుగు సినిమాలు చేసిన మీరు ఆ తర్వాత టాలీవుడ్ కి దూరం అవ్వడానికి కారణం.?
స) పైన చెప్పినట్టు కెరీర్ ఇక్కడే ప్రాంభమైన మద్యలో పలు భాషల్లో ఆఫర్లు వచ్చాయి. ఆ సినిమాలకు సైన్ చేయడం వలన ఇక్కడ సమయం కేటాయించలేకపోయాను. ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడానికి సిద్దంగానే ఉన్నాం.
ప్రశ్న) బికినీ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మొదలైంది.. మీరు కూడా అలాంతో గ్లామరస్ రోల్స్ చెయ్యడానికి, బికినీ వెయ్యడానికి సిద్దమేనా.?
స) మీరన్నట్టు తెలుగులో కూడా బికినీ ట్రెండ్ నడుస్తోంది. నేను ఒక నటిని, నా పాత్ర బికినీ వేయమంటే తప్పకుండా వేస్తాను. ఉదాహరణకి మన స్టార్ హోటల్స్ లో స్విమ్మింగ్ పూల్స్ దగ్గర అందరూ బికినీలలో కనపడుతున్నారు. వాళ్ళే వేస్తున్నప్పుడు ఒక హీరోయిన్ గా నేనెందుకు వెయ్యను చెప్పండి.
ప్రశ్న) మీరు చేయాలనుకునే డ్రీం రోల్స్ యఎమన్నా ఉన్నాయా.?
స) చాలెంజింగ్ గా అనిపించే పాత్రలు చేయాలని ఉంది. ఉదాహరణకి నేను హిందీలో చేసిన ఏంజల్ సినిమాలో నేను పక్షపాతంతో బాధపడే యువతిని. నా పాత్ర మొత్తం వీల్ చైర్ లోనే ఉంటుంది. అది నాకు చాలెంజింగ్ గా అనిపించింది. ఇకా చెప్పాలంటే కంగన చేసిన ‘క్వీన్’ లాంటి సినిమా చేయాలనే కోరిక ఉంది.
ప్రశ్న) టాలీవుడ్లో ఏ స్టార్ హీరోతో నటించాలనేది మీ కోరిక.?
స) ఏ హీరోయిన్ కి అయినా ప్రతి ఒక్క హీరోతో నటించాలని ఉంటుంది. తెలుగులోకి వస్తే నాకు నాగార్జున, మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. వీళ్ళతో అవకాశం వస్తే వెంటనే ఓకే చేసేస్తాను.

