సుప్రీమ్ హీరో సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’ మొన్న విడుదలై డీసెంట్ రివ్యూస్ ను తెచ్చుకుంది. ఇక మౌత్ టాక్ బాగుండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజుల్లో 5.6 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టనుంది. అయితే సోమవారం నుండి ఈ చిత్రం ఏ రేంజ్ లో వసూళ్లను రాబడుతుందో చూడాలి.
కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో నివేథ పేతురాజ్ మరో హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.


