చిత్రలహరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ !

Published on Apr 4, 2019 9:33 am IST

సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన ‘చిత్రలహరి’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఇప్పటికే సినిమాపై మంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 6న గ్రాండ్ గా జరుగనుంది. మరి ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఎవరు వస్తారో చూడాలి.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజు కు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ , నివేత పేతురాజ్ నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

నేను శైలజ ఫేమ్ కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఏప్రిల్ 12న విడుదలకానున్న ఈ సినిమా ఫై తేజు భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి తేజూ కి ఈ చిత్రమైనా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :