సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చిత్రలహరి’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చిత్రలహరి’ !

Published on Apr 8, 2019 1:40 PM IST

darma1

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కాగా తాజాగా ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది.

కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా నటిస్తోంది.

తాజా వార్తలు