20 కోట్ల క్లబ్ లో చిత్రలహరి !

Published on Apr 16, 2019 10:04 am IST

వరుస పరాజయాలతో కెరీర్ ను రిస్క్ లో పడేసుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి చిత్రలహరి ఊరటనిచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకున్న పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.

ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 20కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో బయ్యర్ల పెట్టుబడిలో 80శాతం వెనక్కు తెచ్చింది. ఈ వారం లో ఈచిత్రం చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది. ఇక అటు ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం అంతగా ప్రభావం చూపించలేకపోతుండడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పేలా లేవు. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం :