‘చిత్రలహరి’ కృష్ణా ఫస్ట్ డే కకలెక్షన్స్ !

Published on Apr 13, 2019 10:52 am IST

కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ఏప్రిల్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చిత్రలహరి’కి డీసెంట్ నుంచి ఏవరేజ్ రివ్యూస్ వచ్చాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్-ఆఫీస్ వద్ద నిరాడంబరమైన ప్రారంభ వసూళ్లను రాబట్టింది.

ఇక కృష్ణా జిల్లాలో ఈ చిత్రం మొదటి రోజున రూ .24.23 లక్షల థియేట్రికల్ షేర్ ను సాధించింది. మరి ఈ వారాంతానికి గాని బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రేంజ్ తేలదు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమౌతున్న సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా ఖఛ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి.

ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందించారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా నటించింది.

సంబంధిత సమాచారం :