సినీ కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి – చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని

anil kumar

తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌లో వివిధ ఆరోపణలపై సెక్షన్ 51 ఎంక్వైరీ కొనసాగుతోందని చిత్ర పురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు. ఈ నెల 29న హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఈ మీటింగ్‌లో ఎంక్వైరీ కమిటీ రిపోర్టును సభ్యులకు తెలియజేస్తామని, ఇందులో చాలా విషయాలపై స్పష్టత వస్తుందని అప్పటి వరకు ఎవరూ అనవసర ప్రచారాలు చేయవద్దని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

అయితే సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన ఫైండింగ్స్ పై సెక్షన్ 60 ఎంక్వయిరీ వేయడం జరిగిందని, సెక్షన్ 60 ప్రకారం పూర్తి స్థాయి నివేదిక అందిన తరువాత నిజమైన అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. పూర్తి ఎంక్వయిరీ రిపోర్ట్ వచ్చే వరకు సంమయనం పాటించాలని, జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అన్ని విషయాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియచేస్తామని, అయితే 1600 కుటుంబాల ఆవేదన అర్థం చేసుకుని ఇబ్బంది కలగకుండా సహకరించాలని అనిల్ కుమార్ కోరారు.

Exit mobile version