ఇంట్రెస్టింగ్ కాంబోలో “చియాన్” విక్రమ్.?

Published on Jun 5, 2020 9:14 pm IST

మన టాలీవుడ్ లో కూడా “చియాన్” విక్రమ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే నటనకు ప్రాణం పెట్టె అతి కొద్ది మంది హీరోల్లో చియాన్ కూడా ఒకరు. దాదాపు తన ప్రతీ సినిమాలోనూ ఏదొక కొత్త అవతారంలో కనిపించే విక్రమ్ ఈసారి ఏకంగా 20కి పైగా గెటప్పులలో “కోబ్రా” అనే చిత్రం ద్వారా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు విక్రమ్ ఒక ఇంట్రెస్టింగ్ కాంబోలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ తో “పేట” లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎందుకంత స్పెషల్ అంటే ఈ చిత్రంలో విక్రమ్ తో పాటు విక్రమ్ కొడుకు ధృవ్ కూడా నటించనున్నాడట. ధృవ్ ఇప్పటికే “అర్జున్ రెడ్డి” రీమేక్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. మరి ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More